తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి - minister indrakaran reddy updates

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్(జీ) మండలంలోని టెంబుర్ని గ్రామంలో రూ.34 లక్షల నిధులతో నిర్మించనున్న శ్రీ చక్ర లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

foundation stone for the construction work of Chakra Lingeshwara Swamy Temple by minister indrakaran reddy at temburni village
స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

By

Published : Oct 26, 2020, 6:10 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకే రాష్ట్రంలోని అన్ని ఆలయాలకూ మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండలంలోని టెంబుర్ని గ్రామంలో రూ.34 లక్షల నిధులతో నిర్మించనున్న శ్రీ చక్ర లింగేశ్వర స్వామి ఆలయ కల్యాణ మండపం, స్వాగత ముఖ ద్వార నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 500 ఆలయాల నిర్మాణాలను చేపట్టినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, ఎంపీపీ కొండ్ర రేఖ రమేష్, జడ్పీటీసీ సభ్యులు రామయ్య, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి, ఎంపీటీసీ నడిపొల్ల రవి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'రెండు పడకల గదుల ఇళ్లను అమ్ముకునే వారిపై కేసులు'

ABOUT THE AUTHOR

...view details