తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షంతో అన్నదాతకు కన్నీరు

ఆరుగాలం కష్టించి పండించే రైతుకు ఎల్లప్పుడూ నిరాశే మిగులుతోంది. ఉన్న కాస్త భూమిలో కష్టపడి పండించిన పంట అమ్మి డబ్బులు చేతికి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. నిర్మల్​ జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు తీవ్ర నష్టానికి గురయ్యారు.

అకాల వర్షంతో అన్నదాతకు కన్నీరు

By

Published : Apr 5, 2019, 7:53 PM IST

నిర్మల్ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను నష్టాల పాలు చేసింది. జిల్లాలో అక్కడక్కడ ఈదురు గాలులతో వర్షం కురవడం వల్ల పంట నేలకొరిగింది. మాదాపూర్, జఫరాపూర్, పాకపట్ల గ్రామాల్లో చెతికొస్తున్న దశలో సజ్జ, నువ్వు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరికొన్ని గ్రామాల్లో ఉడికించి ఆరబెట్టిన పసుపు కాస్త తడిసి ముద్దయింది. ఈ విపత్తుతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట పండించడం ఒక ఎత్తయితే... అమ్మడం మరో ఎత్తు అవుతుందని వాపోతున్నారు.

పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతామో.. లాభ పడతామో అని తెలియక అయోమయంలో ఉండగా వరుణుడి ప్రతాపంతో మరింత నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలనుకున్నా యువకులు నిరుత్సాహ పడాల్సి వస్తుందన్నారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తప్పారని రైతులు పేర్కొన్నారు.

జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. తడిసిన పసుపుకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నారు.

అకాల వర్షంతో అన్నదాతకు కన్నీరు

ఇవీ చూడండి: 'ఓటు వినియోగమే కాదు... ఫిర్యాదులూ చేయండి'

ABOUT THE AUTHOR

...view details