నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద అతి ఎత్తైన జాతీయ పతాకాన్ని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.37 లక్షలతో 150 అడుగుల ఎత్తున 48 అడుగుల జాతీయ పతాకం ఏర్పాటు చేశారు.
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 150 అడుగుల జెండా రెపరెపలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, జడ్పీ ఛైర్మన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.