నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ విద్యాలయంలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఓవర్ హెడ్ ట్యాంక్ సమీపంలోని పిచ్చి మొక్కలకు అంటుకున్న నిప్పు స్వల్ప వ్యవధిలోనే వ్యాపించింది. హాస్టల్ భవనాలు సమీపం వరకు వ్యాపించటంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం - బాసర ట్రిపుల్ ఐటీ తాజా వార్తలు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.
అగ్నిప్రమాదం
సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. బైంసా నుండి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు పలుమార్లు ఇలా త్రిపుల్ ఐటీలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.
ఇదీ చదవండి:రాష్ట్రానికి 12 జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు