నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పాన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్ మాట్ బ్యారేజీలో భూములు కోల్పోయిన రైతులు.. పరిహారం కోసం కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పరిహారం చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
రైతులు చేస్తున్న ఆందోళనకు భాజపా నాయకులు మద్దతు తెలిపారు. గత మూడేళ్లుగా పరిహారం ఇస్తామని చెబుతున్నారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదని నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. పరిహారం చెల్లించే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.