నిర్మల్ జిల్లా కుబీర్ విద్యుత్ ఉప కేంద్రం ఎదుట సిరిపెళ్లి హెచ్ గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. తమ పంట పొలాల్లోకి విద్యుత్ సరఫరా కోసం డీడీలు కట్టి మూడేళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతుల కోసమే ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తోందని... అయినా తమకు ఈ సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయాల్లో వర్షాలు కురవక నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
'డీడీలు కట్టి మూడేళ్ల గడుస్తున్నా.. కరెంట్ లేదు' - తెలంగాణ వార్తలు
నిర్మల్ జిల్లా కుబీర్ విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పొలాలకు విద్యుత్ కోసం డీడీలు కట్టి మూడేళ్లు గడుస్తున్నా... ఇంతవరకు కరెంట్ సరఫరా లేదని వాపోయారు. అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంట్ కోసం రైతుల ధర్నా, నిర్మల్ రైతులు
గ్రామంలో విద్యుత్ సరఫరా లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ అన్నారు. అందుకే సమయానికి పంట సాగు చేయడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఏఈ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల