తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆధార్' మార్పులకు దోపిడీ​.. మీ సేవా కేంద్రం సీజ్​ - etv bharat effect

'ఆధార్​లో మార్పులకోసం వెళ్తే అందినకాడికి దోచేస్తున్నారు' అనే పేరుతో ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. నిర్మల్​లో​ అక్రమాలకు పాల్పడుతున్న మీ సేవా కేంద్రాన్ని సీజ్​ చేశారు.

కొంపముంచ్చిన ఆధార్​.. మీ సేవా కేంద్రం సీజ్​
కొంపముంచ్చిన ఆధార్​.. మీ సేవా కేంద్రం సీజ్​

By

Published : Jan 12, 2020, 2:06 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్​ కార్యాలయం సమీపంలో గల మీ సేవా కేంద్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్​ చేశారు. బీడీ కార్మికుల నుంచి దోపిడి చేస్తున్నారనే వార్త.. 'ఆధార్​లో మార్పులకోసం వెళ్తే అందినకాడికి దోచేస్తున్నారు'అనే శీర్షికతో... ఈటీవీ భారత్​లో ప్రచురితమైంది. ఈ కథనానికి కలెక్టర్​ ప్రశాంతి స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో... నిర్మల్​ అర్బన్ తహసీల్దార్​ సుభాష్​ చందర్​ మీ సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

నిర్మల్ మండల ప్రజా పరిషత్​ కార్యాలయం వద్ద ఉండాల్సిన మీ సేవా కేంద్రాన్ని... తహసీల్దార్​ కార్యాలయం ముందు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆధార్​ కార్డులో పేరు, వయస్సు మార్పు కోసం వెళితే అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్లు నిర్ధారించారు. దీంతో మీసేవా కేంద్రాన్ని సీజ్​ చేసినట్లు తహసీల్దార్​ వెల్లడించారు.

కొంపముంచ్చిన ఆధార్​.. మీ సేవా కేంద్రం సీజ్​

ఇదీ చూడండి: ఆధార్​లో మార్పులకోసం వెళ్తే అందినకాడికి దోచేస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details