Etela Rajender Fires on Telangana Government : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదుల సంగమంగా ఉందని.. కానీ మానవ తప్పిదం కారణంగా దుఃఖదాయనిగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. మరవైపు పంట పొలాలు కొట్టుకుపోయి.. ఇసుక మేటలు వేశాయని తెలిపారు. బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని చెప్పారు. కడెం ప్రాజెక్టు దుస్థితికి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శించారు. నిర్మల్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Etela Rajender Comments on KCR : గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 ప్రకటించారని.. అదీ ఇప్పటికి పంపిణీ కాలేదని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. వాగులమీద కాకుండా.. ప్రతికుల ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లు కట్టడమే.. ఈ అనర్థానికి కారణమని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. కళ్లముందే మనుషులు వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు. ఇప్పటివరకూ అధికారికంగా వరదల వల్ల 20 మంది చనిపోయారని.. అనధికారికంగా ఎందరో అని ఈటల రాజేందర్ వివరించారు.
Etela Rajender on Telanana Floods : ఈ క్రమంలోనే ఇళ్లు మునిగిపోయిన కుటుంబాలకు రూ.25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ఈటల రాజేందర్ తెలిపారు. అదేవిధంగా ఇండ్లు కోల్పొయినవారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టాలని అన్నారు. అన్ని శాఖల అధికారులతో కమిటీలు వేసి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.