నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు స్కందమాత అవతారంలో దర్శనమిచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసమేతంగా హాజరై... అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
వేడుకలకు హజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించున్నట్టు తెలిపారు. ఆలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:నిరంతరం విధి నిర్వహణలో పోలీసులు
TAGGED:
indrakaran reddy in basara