నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఫంక్షన్ హాల్లో సాయిదీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సాయిపారాయణం భక్తులను పారవశ్యంలో ముంచెత్తింది. షిరిడి నుంచి వచ్చిన వికాస్ మహరాజ్ వారిచే నిత్యం సాయి చరితను భక్తులకు వివరిస్తున్నారు.
సాయి పారాయణంలో భక్తిపారవశ్యం - nirmal district news today
నిర్మల్ జిల్లా కేంద్రంలో సాయిదీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో సాయిపారాయణం నిర్వహించారు. బాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు, సాయంత్రం మహిళల నృత్యాలు స్థానికులను అలరించాయి.
సాయి పారాయణంతో భక్తిపారవశ్యం
సీతారామ, లక్ష్మణ, సాయిబాబా వేషధారణలతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఉదయం బాబా విగ్రహానికి అభిషేకం, హారతి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, సాయంత్రం మహిళల నృత్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి :శరీరంపై పెయింటింగ్ వేసుకుని ప్రచారం