50 ఏళ్ల కాలం నాటి వాటర్ ట్యాంక్.. క్షణాల్లో కూల్చివేత - నిర్మల్ తాజా
Demolition of watertank in nirmal dist : గత కొన్ని దశాబ్దాలుగా ఆ నీటిట్యాంకు చుట్టూ పక్క ప్రాంత ప్రజల దాహం తీర్చింది. ఈ ట్యాంకును కట్టి చాలా రోజులు కావడంతో అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు. ముందు జాగ్రత్తగానే సమీప ప్రజలందరిని అప్రమత్తం చేశారు. కూల్చివేతను చూడటానికి పెద్దఎత్తున స్థానికులు వచ్చారు.
నిర్మల్ జిల్లాలో నీటి ట్యాంకు కూల్చివేత
Demolition of watertank in nirmal dist : నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో కాలం చెల్లిన నీటి ట్యాంకును అధికారులు కూల్చేశారు. 1971లో నిర్మించిన ఈ ట్యాంకు పట్టణానికి దాదాపు 50 శాతం నీటి సరఫరా చేసేది. నీటిట్యాంకు కూల్చివేత సమయంలో చుట్టుపక్కల వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే సమాచారం అందజేశారు. కూల్చివేతను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివచ్చారు.