క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలంటే క్రీడలతో పాటు వ్యాయామం అవసరమని మంత్రి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టు, ఓపెన్ జిమ్‌ను ఆయన ప్రారంభించారు.
క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం: ఇంద్రకరణ్ రెడ్డి - క్రీడలను ప్రోత్సహిత్సమన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్రంలో క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సహిత్సమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టు, ఓపెన్ జిమ్‌ను ఆయన ప్రారంభించారు.
మంత్రి కాసేపు సరదాగా క్రికెట్ ప్రాక్టీస్ చేసి, వ్యాయామం చేస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు. జిల్లా క్రీడా ప్రాంగణం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లో స్టేడియం ముందు దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి, ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతామని తెలిపారు. జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, పురపాలక ఛైర్మన్ ఈశ్వర్, పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్, హేమంత్ బొడ్కరే, ఎఫ్ఎస్సీఎస్ ఛైర్మన్ ధర్మాజీ రాజేందర్ పాల్గొన్నారు.