కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను,విద్యుత్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ సీపీఐ నిరసన చేసింది. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు నిరంతరం పని కల్పించాలని కోరారు. రోజుకు రూ.200 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ధర్నా - public problems
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు మార్చు కోవాలని సీపీఐ ధర్నా చేపట్టింది. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, రేషన్ కార్డుల సౌకర్యం కలిపించాలన్నారు. ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ రద్దు చేసి ఉచితంగా క్రమబద్ధీకరించాలని, నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆక్రమణలకు గురైన చెరువుల భూములపై విచారణ జరపి, ఆక్రమణదారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్లో రాస్తారోకో