కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రం 38వ వార్డులోని లయన్స్ క్లబ్లో కౌన్సిలర్ నవనీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
‘కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలి’ - నిర్మల్ కరోనా టీకా సెంటర్లు
కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని వివరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
covid cases in nirmal
వ్యాక్సిన్‌పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఈశ్వర్ సూచించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనా టెస్ట్‌లో నెగిటివ్ వచ్చింది.. కానీ ప్రాణం పోయింది..