నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి అనుమానితులపై ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 61 ద్విచక్రవాహనాలు, ఆటో, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణకు దశలవారీగా అన్ని గ్రామాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని, అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
ఎస్పీ ఆధ్వర్యంలో లోకేశ్వరంలో నిర్బంధ తనిఖీలు - nirmal sp
నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ ఆధ్వర్యంలో లోకేశ్వరంలో నిర్బంధ తనిఖీలు