నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఒవైసీనగర్లో జిల్లా ఎస్పీ శశిధర్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడానికి.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, చరవాణి మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు.
భైంసాలో నిర్బంధ తనిఖీలు - ఎస్పీ శశిధర్
భైంసా పట్టణంలో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ శశిధర్