నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి, బోరిగాం గ్రామాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఇంటింటికీ తిరిగి సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, అనుమతి లేకుండా నిలువ ఉంచిన 46 వేల 480 రూపాయల విలువ చేసే మద్యం, 20 వేర రూపాయల విలువ చేసే కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల్లో అభద్రతాభావం పోగొట్టేందుకే తనిఖీలు - నిర్మల్ జిల్లా వడ్డేపల్లి, బోరిగాం గ్రామాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు
నిర్మల్ జిల్లా వడ్డేపల్లి, బోరిగాం గ్రామాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల్లో అభద్రతాభావం పోగెట్టేందుకే తనిఖీలు
పది లీటర్ల గుడుంబా, రెండు వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకే నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. సమాజానికి కీడు చేసే వ్యాపారాలు ఏవైనా చట్ట విరుద్ధమని... అలాంటి వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం