తెలంగాణ

telangana

ETV Bharat / state

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు - CORDON SEARCHES

నేరాలను అదుపు చేస్తూ... శాంతి భద్రతలను నెలకొల్పడమే లక్ష్యంగా పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 100 మంది సిబ్బంది పాల్గొని ఇంటింటా తిరిగి సోదాలు చేశారు.

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు

By

Published : Jul 8, 2019, 1:51 PM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్​ మండలం ఆలూరులో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది సిబ్బంది ఇంటింటికీ తిరిగి సోదాలు చేశారు. సరైన ధ్రువ ప్రతాలు లేని 54 ద్విచక్రవాహనాలు, 3 ట్రాక్టర్లు, అక్రమంగా నిల్వ ఉంచిన 50 వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఈ తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే సమాచారమివ్వాలని సూచించారు.

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details