నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో నూతనంగా చేపట్టిన స్కానింగ్ సెంటర్, ల్యాబ్, ఓపీ వార్డు సహా పలు నిర్మాణ పనులను పరిశీలించారు.
మాతాశిశు సంరక్షణ కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో నూతనంగా చేపట్టిన పలు నిర్మాణ పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Collector Musharraf Ali Farooqi
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వైద్యాధికారులు దేవేందర్ రెడ్డి, రజిని, తహసీల్దార్ సుభాశ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.