నామినేషన్లు దాఖలు చేసిన కో ఆప్షన్ సభ్యులు - election
నిర్మల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఐదుగురు కో ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవమవగా... మిగిలిన రెండు మండలాల్లో రెండేసి నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నామినేషన్లు దాఖలు
నిర్మల్ నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. . నిర్మల్ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా సయ్యద్ సమీర్... మామడ మండలానికి మహ్మద్ అజీజ్... సారంగాపూర్ కోఆప్షన్ సభ్యులుగా ఇస్మాయిల్... నర్సాపూర్‌కి ఫాసియోద్దీన్, లక్ష్మణ చంద్రకి సిరాజు... మొత్తం ఐదు మండలాలకు ఐదుగురు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సోన్, డీలవార్పూర్ మండలాల్లో రెండేసి నామినేషన్లు దాఖలు కావడం వల్ల వీటికి ఎన్నిక జరుగనుంది.