నిర్మల్ జిల్లా కేంద్రం ప్రయదర్శిని నగర్లోని కిరాణ దుకాణంలో దొంగలు నిన్న రాత్రి చోరీకి పాల్పడ్డారు. దుకాణం షట్టర్ తొలిగించి లోపలికి చొరబడ్డారు. సుమారు లక్ష 50 వేల నగదును అపహరించుకుపోయారు. ఉదయం యజమాని దుకాణం తీసేందుకు వచ్చేసరికి షటర్ రెండడుగులు పైకి ఎత్తి ఉండటంతో నివ్వెర పోయాడు. పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు సీసీ పుటేజ్‌లను పరిశీలించి, క్లూస్ టీంద్వారా విచారణ చేపడుతున్నారు.
షట్టర్ తొలిగించి కేటుగాళ్ల చేతివాటం - చోరి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ జనరల్ స్టోర్‌లో నిన్న రాత్రి చోరి జరిగింది. లక్ష 50 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు.
షట్టర్ తొలిగించి కేటుగాళ్ల చేతివాటం