నిర్మల్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్‌లో ఛత్రపతి విగ్రహాన్ని పూలతో అలంకరించారు.
'ప్రజల్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసిన మహాయోధుడు' - chatrapati shivaji birth anniversary 2021
తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ధైర్య సాహసాలతో శత్రువులతో యుద్ధం చేసిన వీరుడు ఛత్రపతి శివాజీ అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
నిర్మల్‌లో ఛత్రపతి శివాజీ ఉత్సవాలు
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌తో పాటు తెరాస నేతలు శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు శత్రువులతో వీరోచితంగా పోరాడిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ అని ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. ఆయన చూపిన ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు.