తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2021, 10:20 PM IST

ETV Bharat / state

నిర్మల్ డిపో నుంచి మరిన్ని బస్సు సర్వీసులు

నిర్మల్​ డిపో నుంచి బస్సు సర్వీసులను పెంచుతున్నట్లు డిపో మేనేజర్​ వెల్లడించారు. హైదరాబాద్​తో పాటు ఇతర ప్రాంతాలకు బస్సు నడుపుతామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

bus services increasing in nirmal depot
నిర్మల్ డిపో నుంచి మరిన్ని బస్సు సర్వీసులు

ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 64 బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు నిర్మల్​ డిపో మేనేజర్​ ఆంజనేయులు తెలిపారు. నిర్మల్ నుంచి హైదరాబాద్​కు 14 సూపర్ లగ్జరీ బస్సులు, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉదయం 9 గంటలకు రాజధాని బస్సు, ఉదయం 11.30 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్టు వివరించారు.

నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మంచిర్యాల, కాగజ్ నగర్, ఖానాపూర్, కడెం, భోథ్, సోనాల, భైంసా ప్రాంతాలకు బస్సులు నడవనున్నాయని పేర్కొన్నారు. గొల్లమాడ, గడ్చందా, రాజురా, సిరిపెల్లి గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు నడుస్తాయని వివరించారు.

ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details