అగ్రవర్ణాల పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదిశాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలుచెయ్యాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి.. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
అగ్రవర్ణాల పేదలకు 10 రిజర్వేషన్ను అమలుచెయ్యాలి: బీజేవైఎం
అగ్రవర్ణాల్లో ఆర్థిక బలహీన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
అగ్రవర్ణాల పేదలకు 10 రిజర్వేషన్ను అమలుచెయ్యాలి: బీజేవైఎం
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రాష్ట్రంలో అమలు చెయ్యకపోవడం దారుణమని బీజేవైఎం జిల్లా భాజపా అధ్యక్షులు ఒడిసెల అర్జున్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తక్షణమే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలుచెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొరిపెల్లి శ్రవణ్ రెడ్డి, గిల్లి విజయ్, కొండాజి శ్రవణ్ తదితరలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'ఏడాదైనా పాసు పుస్తకం ఇవ్వలేదు... అబ్దుల్లాపూర్మెట్లో రైతు ఆందోళన