తెలంగాణ

telangana

By

Published : May 13, 2020, 4:08 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో ఆ ప్రాంతం కర్ఫ్యూ నీడలో కొనసాగుతోంది

భైంసా పట్టణంలో ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు జరిపారు. ప్రస్తుతం భైంసాలో కర్ఫ్యూ కట్టుదిట్టంగా కొనసాగుతుందన్నారు. ఈ సమయంలో లాక్​డౌన్​ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

bhainsa-area-continues-to-be-in-the-shadow-of-curfew
రాష్ట్రంలో ఆ ప్రాంతం కర్ఫ్యూ నీడలో కొనసాగుతోంది

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం నుంచి రూరల్ పోలీస్​ స్టేషన్ వరకు జరిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భైంసాలో కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా బయటికి రావద్దన్నారు.

ప్రజలు సంయమనం పాటించి పోలీసు వారికి సహకరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్గించవద్దని సూచించారు. భైంసా ఘటనకు సంబంధించి మత ఘర్షణలో 21 మందిని, లాక్​డౌన్ ఉల్లంఘించిన కేసులో 40 మందిని అరెస్టు చేశామని చెప్పారు. భైంసా పట్టణంలో రెండు రోజులుగా ప్రశాంత వాతావరణం కొనసాగుతోందన్నారు.

ఇదీ చూడండి :ఈనాడు-ఈటీవీ భారత్ చొరవ.. వలస కూలీలకు ఎర్రబెల్లి చేయూత

ABOUT THE AUTHOR

...view details