కేంద్రం తీసుకొచ్చిన పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల రాజన్న డిమాండ్ చేశారు. కొత్త చట్టంతో బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు జిల్లాలోని లక్ష్మణచాంద మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. మండల కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు.