తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసరలో వసంత పంచమి శోభ - basara saraswathi

వసంత పంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. చలిని లెక్కచేయకుండా అర్దరాత్రి నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చిన్నారులకు అక్షరభ్యాసాలు చేయించేందుకు బారులు తీరారు.

అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు

By

Published : Feb 10, 2019, 6:47 AM IST

Updated : Feb 10, 2019, 10:00 AM IST

బాసరలో భక్తులు
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినం సందర్భంగా వేలాది మంది భక్తులు బాసర చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి అమ్మవారి దర్శనం కోసం బారులుతీరారు.


ఆలయ వేద పండతులు రాత్రి ఒంటి గంటకు మంగళ వాయిద్యాలతో మేల్కొలుపు సేవ నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి మహా అభిషేకం, అలంకరణ చేశారు. వేకువజామున 5 గంటలకు అక్షరాభ్యాస పూజలు ప్రారంభించారు.


రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అక్షరాభ్యాస మండపాలను పెంచినప్పటికీ అమ్మవారి దర్శనానికి 4 నుండి 5 గంటల సమయం పడుతోంది. వసంత పంచమి, శ్రీ పంచమి పురస్కరించుకొని మన రాష్ట్రం నుండే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు, వసతి గృహాలు, ప్రైవేట్​ లాడ్జిలు భక్తులతో నిండిపోయాయి.

Last Updated : Feb 10, 2019, 10:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details