నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట లోకేశ్వరం మండలం బామ్ని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన ఓ రేషన్ డీలరు ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతూ.. బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాల నుంచి ఈ విషయమై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడండి' - Bamni villagers protest to protect occupied lands in nirmal district
నిర్మల్ కలెక్టరేట్ వద్ద లోకేశ్వరం మండలం బామ్ని గ్రామస్థులు ఆందోళన చేశారు. తమ గ్రామంలో కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలంటూ ఆర్డీవో రమేష్ రాఠోడ్‌కు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
'కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడండి'
కలెక్టర్ కార్యాలయంలో.. ఆర్డీవో రమేష్ రాఠోడ్‌కు తమ సమస్య వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆర్డీవో వెంటనే సంబంధిత అధికారిని ఫోన్లో సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసన విరమించారు.
ఇదీ చదవండి:భారత మీడియాపైనా చైనా గుర్రు