నిర్మల్ జిల్లా పోలీస్ శాఖకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న వాహన విడి పరికరాలకు వేలం పాట నిర్వహించనున్నట్లు జిల్లా ఇంఛార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 12న సర్వీసులోలేని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఫర్నీచర్, పాత ఇనుము, బెల్ట్, పాత బ్యాటరీస్, జనరేటర్, డ్రాగన్ లైట్స్, పాలికార్బొనేట్ స్టోన్ గార్డ్స్, హెల్మెట్స్, బాడీ ప్రొటెక్టర్స్ మొదలగు ఇతర వస్తువులను విక్రయించేందుకు వేలం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
పోలీస్ వాహన విడిపరికరాలకు వేలంపాట - తెలంగాణ వార్తలు
పోలీస్ శాఖకు సంబంధించిన నిరుపయోగ వాహనాల పరికరాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఇంఛార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. వాహనాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తామని తెలిపారు. ఆసక్తిగలవారు పాల్గొనాలని చెప్పారు.
పోలీసు వాహనాలకు వేలంపాట, నిర్మల్ జిల్లా ఇంఛార్జీ ఎస్పీ
ఆసక్తి గలవారు ఇతర వివరాల కోసం మొబైల్ 9440795070 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.