ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో చేపడుతున్న ఇంటింటి సర్వేకు అదనపు పారితోషికం ఇవ్వాలని జిల్లా గౌరవ అధ్యక్షురాలు సుజాత కోరారు. ఉచితంగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి' - తెలంగాణ వార్తలు
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఇంటింటి సర్వేలో పాల్గొన్నందుకు అదనపు పారితోషికం ఇవ్వాలని కోరారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం, ఆశా వర్కర్ల డిమాండ్లు
సోన్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కడ్తాల్ గ్రామంలో కరోనాతో మృతిచెందిన ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రూ.50 లక్షల పరిహారం అందించి... ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, ఉపాధ్యక్షులు రామలక్ష్మి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎస్, సీపీ