తెలంగాణ

telangana

ETV Bharat / state

భూమి కోసం పురుగుల మందు తాగిన ఓ రైతు

తన భూమిని ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నిర్మల్​ జిల్లాలో సారంగాపూర్​ మండలం ఆలూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By

Published : Aug 24, 2019, 12:11 AM IST

భూమి కోసం పురుగుల మందు తాగిన ఓ రైతు

తాను సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఇర్ల సాయన్న అనే రైతు పురగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలం ఆలూరు గ్రామాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతును స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ పొలం తనది కాదంటూ.. కరెంట్​ స్టాటర్​ బాక్స్​ను రెవెన్యూ అధికారులు తీసివేశారని, దీని వల్లనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుమారుడు తెలిపారు. తమకున్న 5 ఎకరాల భూమిని 16 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నామని బాధితుని కుమారుడు విజయ్​ తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కక్ష్యసాధింపుకు కోసమే ఈ విధంగా పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

భూమి కోసం పురుగుల మందు తాగిన ఓ రైతు

ABOUT THE AUTHOR

...view details