తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త జిల్లాలోనే జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

కొత్తగా ఏర్పడ్డ నారాయణపేట జిల్లాలోనే జడ్పీ ఛైర్మన్ ఎంపిక జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం ఈ ప్రక్రియ జరగనుంది.

జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

By

Published : Jun 7, 2019, 11:36 PM IST

నారాయణపేట జిల్లాలో మొట్టమొదటి జడ్పీ ఛైర్మన్ ఎన్నిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లైజనింగ్ ఆఫీసర్ కాళిందిని ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నూతన కో- ఆప్షన్ సభ్యుడు, జిల్లా నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను స్థానిక కలెక్టరేట్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. నారాయణపేట నూతన జిల్లాలో 11 జడ్పీటీసీ స్థానాలకు 9 తెరాస కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్, మరొకటి భాజపా సొంతం చేసుకున్నాయి. మెజార్టీ స్థానాలు తెరాస పార్టీ దక్కించుకుంది.

జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి అభ్యర్థి ఎన్నుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంతనాలు కొనసాగిస్తున్నారు. రేపు ఉదయం పది గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుని దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలోనే జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

ABOUT THE AUTHOR

...view details