నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో ముంపునకు గురైన హిందూపూర్, వాసునగర్ తదితర ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. వరదల్లో నష్టపోయిన వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మూడు గ్రామాల్లో సుమారు నాలుగు వేల ఎకరాలకు పైగా పంట నీట మునిగినట్లు తెలిపారు. వరదలు ముందే అంచనా వేసి ముంపు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన జిల్లా కలెక్టర్, పోలీసు యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.
వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం: శ్రీనివాస్ గౌడ్ - We will help those affected by floods: Srinivas Goud
కృష్ణానది వరదల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. నష్టపోయిన వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం: శ్రీనివాస్ గౌడ్