తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేయండి: కలెక్టర్ - district collector

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై అధికార యంత్రాంగం అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో ప్రచారం విస్తృతం చేశారు.

విలువైన ఓటును నచ్చిన వారికి స్వేచ్ఛగా వేసుకోండి : కలెక్టర్

By

Published : Apr 3, 2019, 2:05 PM IST

ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు
నారాయణపేట జిల్లా కేంద్రంలో టూకే రన్​ను జిల్లా కలెక్టర్ ఎస్​.వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. విలువైన ఓటును నచ్చిన వారికి స్వేచ్ఛగా వేసుకోవాలని సూచించారు. నారాయణపేట పట్టణ మహిళలు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.సత్యనారాయణ చౌరస్తాలో ఒట్టేసి ఓటేద్దాం అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో నూటికి నూరు శాతం అందరూ ఓటింగ్​లో పాల్గొనాలని కోరారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.

ఇవీ చూడండి :పార్లమెంట్​ను పైరవీలకు అడ్డాగా మారుస్తారు: దాసోజు


ABOUT THE AUTHOR

...view details