నారాయణపేట జిల్లా మక్తల్లో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కార్మికులు అంబేడ్కర్ చౌరస్తా నుంచి నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీల భర్తీ, జీతాల సవరణ ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపు, ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణతో పాటు, అద్దె బస్సులను రద్దు చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాల నేతలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మరింత ఉద్ధృతంగా నిరసన తెలిపి పాలనను స్తంభింప చేస్తామని హెచ్చరించారు.
'ప్రభుత్వం దిగిరాకపోతే.. సమ్మె ఉద్ధృతమే' - tsrtc strike at mahabubnagar
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘాలు , ఉపాధ్యాయ సంఘాలు పాదయాత్ర చేపట్టాయి.
tsrtc strike at mahabubnagar
TAGGED:
tsrtc strike at mahabubnagar