నారాయణపేట జిల్లా మక్తల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతన మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. . శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛారణల మధ్య నూతన ఎంపీపీగా వనజ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు సుచరిత రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం - chittem
పాత పాలకమండలి పదవీకాలం పూర్తయినందున నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు.
నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం