నారాయణపేట జిల్లా మక్తల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను తిన్న మేకను సిబ్బంది బంధించారు. దాని యజమానికి రెండు వేల రూపాయలు జరిమానా విధించారు. మేకలను బయట విడిచి పెట్టి మొక్కలను నాశనం చేసినందుకు జరిమానా విధించారని, హరితహారం కార్యక్రమం సత్సంకల్పాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఎంపీడీవో పావని తెలిపారు. హరితహారం విషయంలో ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉందని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మేక యజమాని రఫీ జరిమానా కట్టి మేకను విడిపించుకుంటానని మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతానని హామీ ఇచ్చారు.
మొక్క తిన్న మేక..రూ.2వేల జరిమానా
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను తిన్న మేకను బంధించి యజమానికి 2వేల రూపాయల జరిమానా విధించారు.
మొక్క తిన్న మేక