తెలంగాణ

telangana

ETV Bharat / state

'తల్లిదండ్రుల చెంతకు పిల్లల ప్రయాణం'

ఉపాధి లేక ముంబయి వెళ్లడం ఇక్కడి వారికి పరిపాటి... పిల్లలు ఒక చోట తల్లిదండ్రులు మరోచోట... కన్నవారికి దూరంగా చిన్నారులు... ఇది నారాయణపేట జిల్లాలోని వలస కూలీల కథ. వేసవి రావడం వల్ల తల్లిదండ్రుల చెంతకు వెళ్లేందుకు పిల్లలు ప్రయాణమవుతున్నారు.

By

Published : Apr 18, 2019, 7:11 AM IST

Updated : Apr 18, 2019, 7:26 AM IST

బస్సులో పిల్లలు

నారాయణపేట-ముంబయి బస్సులో ఉన్న ఈ చిన్నారులు విహారయాత్రకు బయలుదేరారు అనుకుంటే పొరపాటే... ఎందుకంటే పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున వలస వెళ్లిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.

'తల్లిదండ్రుల చెంతకు పిల్లల ప్రయాణం'

వేసవి వచ్చిందంటే చాలు

నారాయణపేట జిల్లా నుంచి కోయిలకొండ, ధన్వాడ, నారాయణపేట, మద్దూర్, కోస్గి మండలాల ప్రజలు ఉపాధి కోసం ముంబయికి వలస పోవడం ఇక్కడ మామూలే. వారి పిల్లలు మాత్రం ఇంటి దగ్గరే అమ్మమ్మ, నాయనమ్మ వద్ద ఉండి చదువుకుంటారు. వేసవి వచ్చిందంటే చాలు చిన్నారులు ముంబయికి తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు. నారాయణపేట డిపో నుంచి గత మూడు రోజులుగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో మహరాష్ట్రకు ప్రయాణమవుతున్నారు.

ఇవీ చూడండి: భారత్​ భేరి: 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​' దేశీ స్టైల్

Last Updated : Apr 18, 2019, 7:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details