నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలం మల్లెపల్లి గ్రామంలో పదేళ్ల బాలిక పాముకాటుతో మృతి చెందింది. గ్రామానికి చెందిన శంకరప్ప, సత్యమ్మ దంపతులకు కూతురు మౌనిక, ఇద్దరు కుమారులున్నారు. కాగా సోమవారం కుటుంబ సభ్యులంతా కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకు వెళ్లారు. తల్లిదండ్రులు పనులు చేసుకుంటుండగా... మౌనిక తన సోదరులతో కలిసి ఆడుకుంటోంది.
మల్లెపల్లిలో పాముకాటుతో పదేళ్ల బాలిక మృతి - girl died with snakebite at narayanapeta district
నారాయణపేట జిల్లా మల్లెపల్లిలో పదేళ్ల బాలిక పాముకాటుకు గురైంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది.
మల్లెపల్లిలో పాముకాటుతో పదేళ్ల బాలిక మృతి
అదే సమయంలో మౌనికను పాము కరిచింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.