నారాయణపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనకు.. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పంపల్లిలో స్వామి వివేకానంద విగ్రహాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు. కొందరు భాజపాను మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారని.. హిందూ ధర్మ రక్షణ కోసమే పనిచేస్తున్నామని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. 2023లో గోల్కొండ కోటపై.. భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నారాయణపేట్‌లో జరిగిన రైతు సమ్మేళనానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాగు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు.
అన్ని వర్గాల్లో భాజపాకు ఆదరణ వస్తున్న విధంగానే... రైతుల్లో భాజపాపై నమ్మకం కలగకుండా.. సాగు చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీలో రైతులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసేందుకు కూడా సీఎం సమయం ఇవ్వరని విమర్శించారు. 2023లో గోల్కొండ కోటపై.. భాజపా జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు.
రైతులను ఆదుకుంటాం..