తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త మండలాలు - new mandal in vikarabad

నారాయణపేట, వికారాబాద్​ జిల్లాల్లో మరో మూడు మండలాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్​ జారీ చేసింది. నెల రోజుల్లోపు అభ్యంతరాలు, వినతులను కలెక్టర్లకు సమర్పించాలని సూచించింది.

new mandals in telangana
new mandals in telangana

By

Published : Jul 28, 2021, 8:07 PM IST

రాష్ట్రంలో మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. నారాయణపేట జిల్లాలో గుండుమాల్, కొత్తపల్లె.. వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్ పేరిట మండలాలు రానున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.

నారాయణపేట రెవెన్యూ డివిజన్​లో పది గ్రామాలతో గుండుమల్, 11 గ్రామాలతో కొత్తపల్లె మండలాన్ని ప్రతిపాదించారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు రెవెన్యూ డివిజన్​లో 12 గ్రామాలతో దుడ్యాల్ మండలాన్ని ప్రతిపాదించారు. వీటిపై 30 రోజుల్లోపు అభ్యంతరాలు, వినతులను ఆయా జిల్లా కలెక్టర్లకు అందించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీచూడండి:CM KCR: ఆగస్టు 2న సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details