కన్నుల పండువగా శ్రీనివాసుని కల్యాణం - makthal
శ్రీనివాసుని పెళ్లికి భక్తజనం తరలివచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం మక్తల్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది.
నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీనివాసుని కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వేదపండితులు విచ్చేసి పూజలు జరిపారు. ప్రధాన అర్చకులు నారాయణాచార్యుల బృందం పెళ్లి తంతును సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణల నడుమ, అర్చకుల వేద మంత్రోచ్ఛారణలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా జరిగింది.