మక్తల్లో ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు - ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు
నారాయణపేట జిల్లా మక్తల్లో శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చేతనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు
వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ఉత్సవ కమిటీలకు సూచించారు నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన. మక్తల్ పట్టణంలో శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో జిల్లా ఎస్పీ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చేతనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 60 సంవత్సరాల నుంచి శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో వినాయక చవితి సందర్భంగా గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరుపుతామని ఆలయ ట్రస్ట్ అధికారులు ఎస్పీకి వివరించారు.