తెలంగాణ

telangana

ETV Bharat / state

మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు 17మంది శిశువుల జననం - ఒకేరోజు 17మంది శిశువుల జననం

ఓ ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 17 మంది శిశువులు జన్మించిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్​లో చోటు చేసుకుంది.

ఒకేరోజు 17మంది శిశువుల జననం

By

Published : Apr 16, 2019, 11:29 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో రికార్డు స్థాయిలో 17 మంది శిశువులు జన్మించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన కాన్పుల్లో ఇంతమంది జన్మించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. మొత్తం 16 ప్రసవాలు కాగా.. అందులో 2 సాధారణం, 14 సిజేరియన్లు చేశామన్నారు. వారిలో ఓ ఆపరేషన్​లో కవలు జన్మించినట్లు చెప్పారు. కవల పిల్లలలో ఒకరికి గ్రహణ మొర్రి ఉండడం వల్ల ఆ బిడ్డను నిలోఫర్ ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్లు వెల్లడించారు. మిగతా శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. చిన్నారుల్లో 5 గురు మగ, 12 మంది ఆడశిశువులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఒకేరోజు 17మంది శిశువుల జననం

ABOUT THE AUTHOR

...view details