తెలంగాణ

telangana

ETV Bharat / state

పనులు పూర్తి కాలేదు... ఖరీఫ్​కు నీళ్లు రావు..

ఆ రైతులంతా ఖరీఫ్​పై భారీ ఆశలే పెట్టుకున్నారు. రిజర్వాయర్ నుంచి ఈసారి నీళ్లు వస్తాయని ఆశించారు. కానీ వారి కోరిక ఫలించేలా లేదు. నారాయణపేట జిల్లాలో భీమ ఎత్తిపోతల పథకం నుంచి సంగంబండ రిజర్వాయర్​కు నీటిని చేరవేసే కాలువ లైనింగ్ పనులు నత్తనడకన సాగుతూ రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి.

పనులు పూర్తి కాలేదు... ఖరీఫ్​కు నీళ్లు రాలేదు..

By

Published : May 29, 2019, 11:51 AM IST

పనులు పూర్తి కాలేదు... ఖరీఫ్​కు నీళ్లు రావు..

సంగంబండ రిజర్వాయర్​ నుంచి ఖరీఫ్​కు నీటిని అందించడం అసాధ్యంగా కనిపిస్తోంది. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం భీమ ఎత్తిపోతల నుంచి ఈ రిజర్వాయర్​కు నీటిని చేరవేసే కాలువ లైనింగ్​ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చిన్న గోప్లాపూర్​ వద్ద భీమ-1 నుంచి 16 కిలోమీటర్ల పొడవునా కాల్వ లోతు తక్కువ ఉన్న చోట 7కోట్ల వ్యయంతో లైనింగ్​ పనులు చేపట్టారు. జూన్​ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా... రెండు నెలల కిందటే పనులు ప్రారంభించటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంగంబండ రిజర్వాయర్ సామర్థ్యం 3.317 టీఎంసీలు. మక్తల్, మాగనూరు, నర్వ, ఆత్మకూరు మండలాల్లో 64వేల ఎకరాలకు ఈ ప్రధాన కాలువ ద్వారానే సాగునీరు అందుతుంది. కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశాక భీమా -1 నుంచి రిజర్వాయర్​ను నింపాల్సి ఉంటుంది. కాలువ అడుగున 11.65 మీటర్ల వెడల్పు 3.5 మీటర్ల ఎత్తు లైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికి ఇంకా పది శాతం కూడా పూర్తి కాలేదు. వర్షం వస్తే కాలువ అడుగున నీరు నిలిచి పనులు సరిగా జరగవు. రైతులు ఇప్పుడు ఇదే ఆందోళనలో ఉన్నారు. జూన్ రెండో వారంలో ఖరీఫ్​కు నీరు వదిలే లోపు లైనింగ్ పనులు పూర్తి చేయించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: చేపల పెంపకంలో శిక్షణ... రాయితీ రుణాలు

ABOUT THE AUTHOR

...view details