నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో తెరాస ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం పట్టణంలోని యాదవ్‌నగర్, బ్రాహ్మణ వాడ, ఆజాద్ నగర్, అంబేడ్కర్ చౌక్‌లలో ఓట్లు అభ్యర్థించారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. మహబూబ్ నగర్ ఎంపీగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలన్నారు.
మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ ఆధిక్యంతో గెలిపించండి - LOCAL MLA CHITTEM RAMMOHAN REDDY
మహబూబ్ నగర్లో కారు ప్రచార జోరు పెంచింది. మక్తల్‌లో మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలి
ఇవీ చూడండి : పెద్దపల్లి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు..?