తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి'

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వార్​లో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో కలెక్టర్​ హరిచందన పాల్గొన్నారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

narayapet collector harichandhana participated in haritha haaram
'గ్రామాల్లో ప్రతీ ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి'

By

Published : Jun 26, 2020, 6:34 PM IST

గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన సూచించారు. ఊట్కూరు మండలం బిజ్వార్​లో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.

డంపింగ్ యార్డు, స్మశాన వాటిక పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందుబాటులో లేని అధికారులపై చర్యలు తీసుకోవాలని... వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను కలెక్టర్​ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ అశోక్ గౌడ్, సర్పంచ్ సావిత్రమ్మ, ఎంపీడీవో జయశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

'గ్రామాల్లో ప్రతీ ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి'

ఇవీచూడండి:శానిటైజర్లా..శనిటైజర్లా..? మార్కెట్​లో నాసిరకం అమ్మకాలు

ABOUT THE AUTHOR

...view details