కొవిడ్ టీకా అందించేందుకు ఆయా యూనిట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి జయచంద్రమోహన్ ఆదేశించారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు, నివేదికలపై చంద్రమోహన్ ఆరా తీశారు. రెండో విడత కొవిడ్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో డా.శైలజ, సిద్దప్ప, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
'కొవిడ్ టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలి'
కరోనా టీకా అందించేందుకు ఆయా యూనిట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి జయచంద్రమోహన్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు.
నారాయణపేట, డీఎంహెచ్‌వో, కొవిడ్ టీకా