ప్రజలందరూ పోషకాహారం తీసుకునేలా అంగన్వాడి టీచర్లు ప్రజలలో చైతన్యం కలిగించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. జిల్లాలో శిశు సంక్షేమ శాఖ నిర్వహించే పోషణ వారోత్సవాల నిర్వహణపై సీపీడీవో, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు.
పోషక వనాలు ఏర్పాటు చేయడంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. పోషక వనాలలో పండించిన ఆకు కూరలు, కూరగాయలు తల్లులకు పంచి పెట్టడం, పంపిణీ చేసిన కూరగాయలు గర్బిణీలు, బాలింతలు తింటున్నారా? లేదా? అనే విషయాన్ని తప్పక పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఒక్క శిశువు కూడా పోషకాహార లోపానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత సీపీడీవో, సూపర్వైజర్లదేనని స్పష్టం చేశారు.