తెలంగాణ

telangana

'గిట్టుబాటు ధర రావాలంటే రైతు బజార్​లోనే విక్రయించాలి'

నారాయణపేట జిల్లా రైతులు.. వారు పండించిన కూరగాయలను స్వయంగా విక్రయించేందుకు మొగ్గు చూపాలని కలెక్టర్​ హరిచందన సూచించారు. రైతు బజార్​ సముదాయం, ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్​ హరిచందన ఆకస్మిక తనిఖీ చేశారు.

By

Published : Feb 16, 2020, 4:55 PM IST

Published : Feb 16, 2020, 4:55 PM IST

narayanapet collector harichandana visited raithu bajar
నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన ఆకస్మిక తనిఖీ

నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన ఆకస్మిక తనిఖీ

రైతులు పండించిన కూరగాయలు గిట్టుబాటు ధరకు స్వయంగా విక్రయించేందుకే జిల్లాలో రైతు బజార్​ ఏర్పాటు చేశామని నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన అన్నారు. దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు.

ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డితో కలిసి రైతు బజార్​ సముదాయం, ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్​ హరిచందన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారో లేదో ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details